Munugode By Poll: చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్దం

మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్దమైంది. ఉద్దేశ్యపూర్వకంగానే ఈప్రచార సామాగ్రిని దుండగులు దగ్ధం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

  • Written By:
  • Updated On - October 11, 2022 / 05:39 PM IST

Munugode: మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్దమైంది. ఉద్దేశ్యపూర్వకంగానే ఈప్రచార సామాగ్రిని దుండగులు దగ్ధం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ కార్యాలయంలో భద్రపరిచిన రూ. 5 లక్షల విలువైన జెండాలు ఎన్నికల ప్రచార సామాగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.

ఈ ఘటన పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మునుగోడులో కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రత్యర్ధుల దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పార్టీ ఆఫీస్ పై దాడి చేసి దిమ్మెలు కూల్చినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తమ పార్టీ కేడర్ ను బెదిరించాలని టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు పన్నాయని ఆయన చెప్పారు. పార్టీ కార్యాలయం పై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.