Congress party : టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలోనే పలువురు టికెట్ రాని ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత మాత్రం టికెట్ రాలేదని ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 07:08 PM IST

Congress party : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలోనే పలువురు టికెట్ రాని ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత మాత్రం టికెట్ రాలేదని ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాన్సువాడ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను నవంబరు 10 నుంచి స్వీకరిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి భుజంగ్ రావు తెలిపారు.

బాన్సువాడకు చెందిన కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు టికెట్ రాలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగారు. బీసీ నేత అయిన తనకు కాకుండా మోసం చేసి స్థానికేతరుడు అయిన ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ అమ్ముకున్నారని బాలరాజు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆయన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాసుల బాలరాజుకు టికెట్ రాకపోవడంతో బాన్సువాడ లోని వివిధ ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు.

దానికి తగ్గట్లే బుధవారం అధిష్ఠానం మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తనను కాదని స్థానికేతరుడైన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.