Hyderabad: కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది ఇప్పట్లో నయమయ్యే పరిస్థితి లేదని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు.
ఒక హోంగార్డు పార్టీ నుంచి పోతే పోయేది ఏం లేదని తనలాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడతారని అన్నారు. తెలంగాణలో చెంచాగాళ్లతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగోలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దని తాను కూడా చెప్పానని అన్నారు. ఎవరు పార్టీలో నుంచి బయటకు వెళ్లినా రేవంత్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి శుక్రవారం మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లిలో అమిత్ షాను కలిసారు. మర్రి శశిధర్ రెడ్డి చేరికను అమిత్ షా స్వాగతించినట్లు తెలిసింది. మరి కొద్దిరోజుల్లోనే ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.