Site icon Prime9

CM KCR : జనగామ సభ వేదికగా సీఎం కేసీఆర్ వరాల జల్లు.. బీఆర్ఎస్ గూటికి పొన్నాల

Cm Kcr fires on oppositions at aswaraopet meeting on vikarabad

Cm Kcr fires on oppositions at aswaraopet meeting on vikarabad

CM KCR : తెలంగాణలో ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారమే లక్ష్యంగా సన్నాహాలు చేపడుతుంది. ఈ క్రమం లోనే నేడు జనగామలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ జనగామ జిల్లాకు వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామన్నారు. పాత వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా వరి పండించే తాలూక జనగామ అని చెప్పారు.

హైదరాబాద్‌కు సమీపంలో ఉంది కనుక జనగామ అభివృద్ధికి సమృద్ధిగా అవకాశాలు ఉంటాయన్నారు. త్వరలోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించిన తరువాత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. జనగామలో మెడికల్‌ కాలేజీతో పాటు నర్సింగ్‌, పారా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జనగామ, భువనగిరి గ్రోత్‌ కారిడార్‌లుగా మారాయన్నారు కేసీఆర్. రైతుల కోసం ఉచిత కరెంట్ ఇస్తుంటే, కాంగ్రెస్ వాళ్లు మాత్రం వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని చెబుతున్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 93 లక్షల మందికి కేసీఆర్‌ బీమా అమలు చేస్తామన్నారు. రైతుబీమా తరహాలేనే వ్యక్తి చనిపోతే వారంలోనే రూ.5 లక్షల నగదు ఇస్తాం, ఈ ఎన్నికల్లో గెలవగానే రేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం ఇవ్వడంతో పాటు అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు.

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. ఈ నెల 13న పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని పొన్నాల లక్ష్మయ్య భావించగా.. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్టు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. ఈ మేరకు పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఇక ఈ నెల 14న పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ లో చేరాలని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. దాంతో నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు రిజర్వాయర్లను నిర్మించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామీణాభివృద్ది కోసం కేసీఆర్ సర్కార్ తోడ్పాటు అందిస్తుందన్నారు.

 

Exit mobile version