CM KCR: కర్రుకాల్చి వాతపెట్టిన బీజేపీకు బుద్ధి రావట్లేదు- కేసీఆర్

CM KCR: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో దిల్లీ ప్రజలను అవమానిస్తోందని అన్నారు. కేంద్రం వెంటనే.. ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

CM KCR: భాజపా ప్రభుత్వం తీరు.. ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలోనే దేశం మెుత్తం భాజపాకు తగిన బుద్ధి చెబుతుందని అన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ పాల్గొన్నారు.

ఎమర్జెన్సీ దిశగా భాజపా..

భాజపా ప్రభుత్వం తీరు.. ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలోనే దేశం మెుత్తం భాజపాకు తగిన బుద్ధి చెబుతుందని అన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ ను సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ.. విపక్షాల మద్దతు కూడగట్టేందుకు దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవత్‌ మాన్‌ సింగ్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ ఏమన్నారంటే..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో దిల్లీ ప్రజలను అవమానిస్తోందని అన్నారు. కేంద్రం వెంటనే.. ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ లో ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా.. పోరాటం చేయాలని కేజ్రీవాల్ సీఎం మద్దతు కోరారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. కేంద్రంపై మండిపడ్డారు.

కేంద్ర పాలన విధానం.. ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉందని ఆరోపించారు. వెంటనే ఆ ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన కూడా.. కేంద్రం తన వైఖరి మార్చుకోవడం లేదన్నారు. మరోవైపు గవర్నర్‌ వ్యవస్థతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

పోరాటం చేయాలి..

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్దినెన్సు తెచ్చిందని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని అన్నారు.

ప్రభుత్వ అధికారుల విషయంలో దిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ భాజపాయేతర ప్రభుత్వాలను కూల్చుతోందని ఆరోపించారు.

ఫొటోలు దిగేందుకే నీతిఆయోగ్‌..

ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తెలిపారు.

భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని ఆరోపించారు. భాజపాయేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్లను వాడుకుంటున్నారని ఆరోపించారు.