Site icon Prime9

Operation Akarsh: ఆకర్ష్ డీల్ ఘటన.. సీఎం కేసిఆర్ పై కేసు నమోదు చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Case should be registered against KCR... Union Minister Kishan Reddy

Case should be registered against KCR... Union Minister Kishan Reddy

Hyderabad: మొయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా సాగిన తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ ఘటనలో సీఎం కేసిఆర్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో ఎమ్మెల్యేల కొనుగోలు స్కాంను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన తెరాస పార్టీ కొత్త ఆటకు తెరతీసిందని ఆరోపించారు. ఫామ్ హౌస్ లో ఎంత నగదు దొరికిందో చెప్పాలి, దాంతోపాటు ఆ డబ్బు ప్రగతి భవన్ నుండి వచ్చిందా, ఫామ్ హౌస్ నుండే వచ్చిందో తక్షణమే బయటపెట్టాలన్నారు.

తెరాస నేతలతో కూడా పట్టుబడ్డ నందకుమార్ తో ఫోటోలున్నాయన్న గుర్తు చేశారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేను తెరాసలోకి చేర్చుకొన్న మాటల వాస్తవం కాదా, ఫిరాయింపులు ఎవరు చేయించారని చెప్పాలన్నారు. ఒక పార్టీలో గెలిస్తే, ముద్దుల కుమారుడి ప్రలోభాలతో తెరాసాలోకి చేరిన ఆ శాసనసభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి అయిన మాట నిజంగాదా అన్ని కిషన్ రెడ్డి వ్యగంగా పేర్కొన్నారు. ప్రజాబలం లేని ఎమ్మెల్యేలు భాజపాకు అవసరంలేదనన్నారు. మద్యవర్తులతో పనిలేదు. పదవులకు రాజీనామా చేసి ఎవరైనా భాజపాలోకి చేరవచ్చని కిషన్ రెడ్డి సూచించారు.

కేంద్ర భాజపా వద్ద నాలుగు వందల కోట్లు లేవన్న కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఇచ్చే స్తోమత బీజేపీకి లేదు. సొంత విమానాలు కొనే పార్టీ బీజేపీ కాదన్నారు. దొంగే దొంగ దొంగ అన్న చందంగా పోలీసుల తీరు ఉంది. దుబ్బాక బైపోల్స్ ముందు కూడా రఘునందనరావు బంధువుల ఇంట్లో పోలీసులే డబ్బులు పెట్టారు. నలుగురు ఎమ్మెల్యేలతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే పరిస్థితి లేదు. నవంబర్ 6న‌ కేసీఆర్ తీసిన సినిమా రిజల్ట్ రాబోతోంది. ఈడీ, సీబీఐ పేరుతో సానుభూతి పొందాలని ప్రయత్నించిన టీఆర్ఎస్ విఫలమైంది. ప్రధాని మోదీ, బీజేపీ దిష్టిబొమ్మలను తగలబెట్టడాన్ని ఖండిస్తున్నాను అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version