Hayath Nagar: హైదరాబాద్ లోని హయత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ సెల్లార్ లో నిద్రిస్తున్న పాపపై నుంచి.. కారు వెళ్లడంతో చిన్నారి మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News Of Town | #Car runs over 2-year-old #girl in #parking area of Hayathnagar #Apartment. pic.twitter.com/I53TDq40qB
— News of Town (@NewsofTown1) May 25, 2023
సీసీ ఫుటేజ్ వైరల్.. (Hayath Nagar)
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ సెల్లార్ లో నిద్రిస్తున్న పాపపై నుంచి.. కారు వెళ్లడంతో చిన్నారి మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటణకు చెందిన కవిత, రాజు దంపతులు బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు.
ప్రస్తుతం వారు హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీలోని బాలాజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లో శ్లాబులు పనులు చేస్తున్నారు.
వీరికి ఇద్దరు సంతానం కాగా.. ఏడేళ్ల వయసున్న కుమారుడు, మూడేళ్ల కూతురు లక్ష్మీ ఉన్నారు.
పనులకు తమతో పాటు.. చిన్నారిని తీసుకెళ్లారు. పాప నిద్రపోవడంతో.. నీడ కోసం పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్లేస్ లో పడుకోబెట్టారు.
అయితే, కొద్దిసేపటి తర్వాత అపార్ట్ మెంట్ లో నివసించే హరిరామకృష్ణ అనే వ్యక్తి తన కారును పార్క్ చేయడానికి సెల్లార్ లోకి వెళ్లాడు.
తనకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్ లో పాప నిద్రిస్తుందన్న విషయాన్ని గమనించని అతను కారును ముందుకు తీసుకెళ్లాడు.
దీంతో కారు ముందు టైర్ పాప తలపై నుంచి వెళ్లింది. దీంతో వెంటనే కారును వెనక్కి తీసినప్పటికీ పాప తీవ్రంగా గాయపడ్డారు.
ఇది గమనించిన పాప తల్లి.. స్థానికుల సహాయంతో చికిత్స కోసం ఆస్పత్రికి తెరలించారు. కానీ, అప్పటికే పాప మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారిస్తున్నారు.