Site icon Prime9

BRS Meeting: ‘ముందస్తు ముచ్చటే లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు’: సీఎం కేసీఆర్

BRS Meeting

BRS Meeting

BRS Meeting: బీఆర్ఎస్ పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షత వహించారు. ఈ ఏడాది డిసెంబరులోపు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

పార్టీ నేతలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తోందని,

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరింత చొరవ చూపాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

త్వరలో వరంగల్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కేసీఆర్ తెలిపారు.

 

విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లండి(BRS Meeting)

పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని ముఖ్యనేతలకు సీఎం( CM KCR) సూచించారు.

కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కూడా సమావేశంలో సీఎం కేసీఆర్‌ నేతలకు వివరించారు.

గృహలక్ష్మి పథకం ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు, దళిత బంధు, రెండో విడత గొర్రెల పంపిణీ సహా ప్రభుత్వ పథకాలన్నింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు పనిచేయాలన్నారు.

ఏటా టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ ప్లీనరి నిర్వహించే వారు. ఇకపై భారాస ఆవిర్భావం రోజే పార్టీ ప్లీనరి నిర్వహించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు సమావేశంలో వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణలో సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్న సీఎం కేసీఆర్‌.. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.

 

ముందస్తు లేదనే సంకేతాలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సీఎం కేసీఆర్ కూడా ముందస్తు ఆలోచనలో ఉన్నారని.. ఈ క్రమంలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు వెళ్తారనే ప్రచారం జరిగింది.

అయితే ఈ ముందస్తు వ్యవహారంలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో నేతలను ఉద్దేశించి కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు.

‘తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందుస్తు సమస్యే లేదు. డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి. దాని ప్రకారమే నేతలంతా ప్లాన్ చేసుకోండి. నియోజక వర్గాల వారిగా

సమావేశాలు నిర్వహించుకోవాలి. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్లండి’ అని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే కేసీఆర్ వ్యాఖలు వ్యూహంలో భాగమేనని రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

కచ్చితంగా ప్రతిపక్షాల ఊహకందని రీతిలో కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

Exit mobile version