Site icon Prime9

BRS EX MLA Madan Lal : యువతితో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ రాసలీలలు.. పిక్స్ వైరల్

BRS EX MLA Madan Lal with young girl photos goes viral on media

BRS EX MLA Madan Lal with young girl photos goes viral on media

BRS EX MLA Madan Lal : తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ఒక వైపు త్వరలో రానున్న ఎన్నికల కోసం పార్టీలన్నీ సిద్దమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్.. రాసలీలల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానుకు మదన్ లాల్ ఓ యువతితో సన్నిహితంంగా ఉన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి లిస్టులు ప్రకటించే నేపథ్యంలో వైరా నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ (BRS EX MLA Madan Lal) పేరు ప్రస్తావించిన నేపథ్యంలో ఈ విధంగా ఫోటోలు లీక్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సప్ గ్రూపుల్లో ఫొటోలు వైరల్ అవుతున్న పరిస్థితుల్లో ఈ విషయంపై మదన్ లాల్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్ధులు మార్ఫింగ్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారని మదన్ లాల్ వర్గీయులు అంటున్నారు.

Telangana: ఖమ్మం బీఆర్ఎస్‌లో చిత్రవిచిత్ర పరిణామాలు.. మాజీ ఎమ్మెల్యే రాసలీల  ఫోటోలు వైరల్.. - Telugu News | Khammam BRS Leader Madan Lal Personal Photos  Viral On Social Media | TV9 Telugu

అయితే మరోసారి సీటు తనకే వస్తుందంటూ ఎమ్మెల్యే రాములు నాయక్‌ ధీమాగా ఉన్నారు. మరోవైపు మాజీలు మదన్‌లాల్‌, బానోతు చంద్రావతిలు సైతం తమకే సీటు అని చెబుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌, ఆయన వర్గీయులకు ఇది ఊహించని ఝలక్‌ అని చెప్పొచ్చు. ఈ రాసలీలల ఫొటోల వ్యవహారంపై మదన్‌లాల్‌ ఇంకా స్పందించాల్సి ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను రెండు విడతల్లో విడుదల చేసేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. 86 నియోజకవర్గాల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. మంచిరోజు కావడంతో ఈ నెల 21న తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రగతిభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో 90 నుంచి 105 మంది పేర్లతో జాబితా వెలువడే అవకాశమున్నట్లు సమాచారం.

Exit mobile version
Skip to toolbar