Site icon Prime9

BJP leader Ravikumar: నోటు పుస్తకాలు పంపిణీ చేసిన భాజపా నేతలు

BJP leaders distributed note books.png

BJP leaders distributed note books.png

Hyderabad: కుకట్ పల్లి లోని వివేకానంద నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు నోటు పుస్తకాలను భాజపా నేత రవికుమార్ యాదవ్ ఉచితంగా పంపిణీ చేసారు. పాఠశాల సమస్యల పై నేతలు దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి 8 ఏళ్లు అవుతున్నా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పాఠశాలలు నోచుకోపోవడం దురదృష్టకరమన్నారు. ప్రధానమంత్రి సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నామన్నారు.

పాఠశాల భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్ధితి వుందన్న విషయాన్ని విద్యార్ధులు, ఉపాధ్యాయులు నేతల దృష్టికి తీసుకొచ్చారు. 5 గదుల్లో పాఠశాల నిర్వహిస్తుండడాన్ని నేతలు తప్పుబట్టారు. మిగిలిన విద్యార్ధుల ఎక్కడ కూర్చోవాలని ప్రశ్నించారు. ఉచిత విద్య పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. పాఠశాలలకు తగినంత నిధులు కేటాయించకపోవడమే కారణంగా చెప్పుకొచ్చారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను మళ్లించడమే రాష్ట్ర ప్రభుత్వ పనిగా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాజాపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే..

 

Exit mobile version