Site icon Prime9

BJP Dharna: రేపు పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద ధర్నా.. ప్రకటించిన భాజపా

BJP announces dharna tomorrow at Police Command Control

Hyderabad: తమ కార్యకర్తల పై దాడులు జరిగినా పట్టించుకోవడం లేదంటూ రేపటి దినం పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద భాజపా ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 10గంటలకు 500మంది ధర్నాలో పాల్గొనున్నట్లు తెలిపారు. భాజపా హైదరాబాదు అధ్యక్షులు గౌతమ్ రావు ఆధ్వర్యంలో ఈ ధర్నాను నిర్వహించనున్నారు. ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు ధర్నాలో పాల్గొననున్నారు.

గత నెల 27న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూసుఫ్ గూడ చెక్ పోస్టు వద్ద తెరాస-భాజపా కార్యకర్తల మద్య దాడి జరిగింది. ఈ క్రమంలో భాజపా కార్యకర్తలకు దెబ్బలు తగిలాయి. దాడికి బాధ్యలైన తెరాస కార్యకర్తల పై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు ప్రయత్నించలేదు. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచనలమేర ధర్నాకు దిగనున్నారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy: కేసిఆర్ ఆరోపణలు హస్యాస్పదం…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Exit mobile version