Site icon Prime9

Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికలో భారీ బెట్టింగ్‌లు

Big bets in munugode by-elections

Hyderabad: మీ పని రాజకీయాలు. మా పని రాజకీయలతో వ్యాపారం. ఇది ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ ముఠాల తీరు. రేపటిదినం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు సాగనుంది. ఈ క్రమంలో పోలింగ్ రౌండ్లను ఓవర్ లెక్కన బుకీలు పంచుకొన్నారు. హైదరాబాదులోని పలు లాడ్జీల్లో తిష్ట వేసిన బెట్టింగ్ రాజాలు ఏజెంట్ల ద్వార లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

పెట్టిన మొత్తానికి రెండింతలు అంటూ కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఖరీదైన ఎన్నికగా పేర్కొంటున్న మునుగోడు ఉప ఎన్నిక విజయాల పై దాదాపుగా రూ. 100కోట్లకు పైగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారనేది తాజా సమాచారం. పోలింగ్ సరళి, పార్టీల మద్య వ్యత్యాసాలు, మెజార్టీలు, డిపాజిట్ గల్లంతు అభ్యర్ధులు ఇలా రక రకాలుగా బెట్టింగ్ చేసేందుకు అంతా రెడీ అయినారు. అయితే పోలీసులు నిఘా ఉన్నట్లుగా చెబుతున్నా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు బుకీలకు అండగా ఉండడంతో చూసి చూడన్నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. తూతూ మంత్రంగా కొన్ని లాడ్జీలను తనిఖీలు చేపట్టిన్నట్లు రికార్డుల్లో పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. సీఈవో వెల్లడి

Exit mobile version