Site icon Prime9

Hanamkonda: హనుమకొండ ఏసీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

bandi-sanjay-public-meeting

bandi-sanjay-public-meeting

Hanamkonda: హనుమకొండ ఏసీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ సభకు అనుమతి నిరాకరించడం పై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రెమేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు కార్యాకర్తలు ఏసీపీ ఆఫీస్ వద్దకు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ సభకు కుట్రపూరితంగానే ఆటంకం కలిగిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. వెంటనే సభకు అనుమతి ఇవ్వాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

బండి సంజయ్ పాదయాత్ర ఈ నెల 27తో ముగుస్తుంది. అదే రోజు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభను నిర్వహణకు ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేనందున అనుమతి రద్దు చేస్తున్నట్టు లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో మరో మారు కోర్టు మెట్లు ఎక్కేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. సభ నిర్వహించుకునేందుకు నిన్న అనుమతి ఇచ్చి ఇవాళ రద్దు చేయడమేంటని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కావాలనే అడ్డంకుంటున్నారని, కోర్టుకు వెళ్లి సభ నిర్వహణకు అనుమతి తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version