Site icon Prime9

Attack on Barrelakka : కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కపై దాడి.. స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ

Attack on Barrelakka alias sireesha independent candidate of kollapur assembly constituency

Attack on Barrelakka alias sireesha independent candidate of kollapur assembly constituency

Attack on Barrelakka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కూడా హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో శిరీష బరిలోకి దిగుతుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన ఈ యువతి బర్రెలక్కగా అందరికీ సుపరిచితురాలుగా మారింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈమె.. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రచారంలో దూసుకుపోతూ అందరి దృష్టిని ఆమె ఆకర్షిస్తోంది.

అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బర్రెలక్క ( Attack on Barrelakka ) హాట్ టాపిక్‌గా మారింది. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. బర్రెలక్కకు సపోర్టుగా ప్రచారంలో పాల్గొన్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన తమ్ముడిపై ఎందుకు దాడి చేశారంటూ ప్రశ్నిస్తూ కన్నీటి బర్రెలక్క పర్యంతమైంది. రాజకీయాలంటే రౌడీయిజం అని గతంలో చెప్పేవారని, తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఓట్లు చీలుతాయనే భయంతోనే తనపై రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని బర్రెలక్క వ్యాఖ్యానించింది.

పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేసింది. కాగా ఆమెపై దాడిని ఖండిస్తూ పలువురు ఆమెకు మద్దతుగా నిలబడుతున్నారు. అదే విధంగా భద్రతను కల్పించాలంటూ ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ప్రచారానికి లభిస్తున్న మద్దతును చూసి ఓర్వలేని వారే ఇలా దాడులకు పాల్పడున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శిరీష, ఆమె సోదరుడిపై జరిగిన దాడి ఘటనపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. దాడిని ఖండిస్తున్నట్టు పేర్కొంటూ ఎక్స్ చేశారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీ, ఎన్నికల కమిషన్, సీఈవో తెలంగాణను ట్యాగ్ చేశారు. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే దాడులు చేసి బెదిరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

 

 

Exit mobile version