Site icon Prime9

Telangana TDP: ఈ నెల 10 న తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం

Telangana TDP

Telangana TDP

Hyderabad: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్దాయి సమావేశం ఈ నెల 10 న జరగనుంది. ఎన్టీఆర్ భవన్ లో జరిగే  ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. అధ్యక్షపదవి పై పార్టీ నేతలతో చంద్రబాబు ఇప్పటికే చర్చించారని వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడ తీసుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్జానేశ్వర్ టీటీడీపీ అధ్యక్షపదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఈ పదవి ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. కాసాని జ్ఞానేశ్వర్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ కాసాని పనిచేశారు.

Exit mobile version