Site icon Prime9

MLAs purchasing case: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు నిందితుడు రామచంద్ర భారతి పై మరో కేసు

Another case against the accused Ramachandra Bharti in the MLA temptation case

Hyderabad: తెరాస పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందుతుడు రామచంద్రభారతి పై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

రెండు రోజుల క్రితమే పోలీసులు ఆయనపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసిన్నప్పటికీ వివరాలు వెల్లడించకుండా గోపత్యను పాటించారు. ఇందుకు సంబంధించిన పలు కీలక ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. తెరాస శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు ఎమ్మెల్యేకు ఎలా తెలిసిందో పోలీసులు కోర్టులో చెప్పే అవకశాం ఉంది.

ఇది కూడా చదవండి: Thamilisai vs Sabitha Reddy: తెలంగాణలో ముదురుతున్న పెండింగ్ బిల్లుల వ్యవహారం

Exit mobile version