Site icon Prime9

Amit Shah: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వల్లే భాగ్యనగరానికి విముక్తి

Amith shah on liberation day

Amith shah on liberation day

Hyderabad: తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదని, అన్ని పార్టీలు భయపడ్డాయి. కానీ ఈ ఏడాది ప్రధాని కృషితో భాగ్యనగరంలో స్వాతంత్య్ర జెండా రెపరెపలాడుతుందని కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు.

ఈ సంవత్సరం ఎలాగైనా హైదరాబాద్‌లో విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మొదటగా అమరవీరులకు ఆయన నివాళులర్పించారు.

హైదరాబాద్‌ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న స్వాతంత్ర్యం వచ్చిందని, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కృషితో నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించిందని ఆయన వెల్లడించారు. దేశమంతటికీ స్వాతంత్ర్యం వచ్చినా, హైదారాబాద్ మాత్రం నిజాం, రజాకార్ల ఉచ్చులో చిక్కుకుని అల్లాడుతుందని స్వేచ్ఛా గాలులను ఆస్వాధించలేకపోతుందని గుర్తించిన సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ వారికి వ్యతిరేకంగా ఆపరేషన్‌ పోలో ద్వారా నిజాం పాలనకు స్వస్థి పలికారు. ఉక్కుమనిషితో పాటు సైయ్యంటూ మరికొంతమంది స్వతంత్ర కాంక్షులు ఈ పోరాటంలో పాల్గొని ప్రాణత్యాగం చేశారని అమిత్ షా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: నేడు భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..?

Exit mobile version