Site icon Prime9

Poonam kaur: రాహుల్ గాంధీ జోడోయాత్రలో సినీనటి పూనమ్ కౌర్

Poonam Kaur

Poonam Kaur

Bharath Jodo Yatra: తెలంగాణలో రాహుల్ గాంధీ నాలుగో రోజు భారత్ జోడో యాత్రను శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి ప్రారంభించారు. ఈరోజు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్‌ మీదుగా జడ్చర్ల వరకు సాగనుంది. ఈ సందర్బంగా పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఉస్మానియా వర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్స్, తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ జేఏసీ సభ్యులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు.

రాహుల్ గాంధీ పాదయాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు పూనమ్ కౌర్ కొద్దిసేపు కలిసి నడిచారు. చేనేత కార్మికుల సమస్యల పై రాహుల్ గాంధీతో మాట్లాడినట్టుగా పూనమ్ కౌర్ చెప్పారు. రాహుల్ గాంధీ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని అన్నారు. చేనేత సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రాహుల్‌ను కోరానని చెప్పారు.

ఈరోజు 20.3 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. ఎమ్మెల్యే సీతక్క, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఏనుగొండ జంక్షన్‌ వద్ద రాహుల్ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. తిరిగి సాయంత్రం 4 గంటల తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తారు.

Exit mobile version