Site icon Prime9

Mulugu: పెళ్లి చేసుకోమని వేధింపులు.. యువకుడిని చంపిన యువతి

shocking murder case happened in bihar

shocking murder case happened in bihar

Mulugu: ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. తనను వేధిస్తున్న సమీప బంధువును యువతి కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.

యువకుడి దారుణ హత్య.. (Mulugu)

ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి.. మహిళలపై దాడులు చేసిన ఘటనలు మనం చాలానే చూశాం. కానీ ఇక్కడ వేధింపులకు పాల్పడున్న యువకుడినే యువతి హత్య చేసింది. ఈ హత్య స్థానికంగా అలజడి రేపింది. ప్రేమ పేరుతో.. పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్న దగ్గరి బంధువును యువతి హత్య చేసింది.

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం ఎర్రలవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాస్‌ అనే యువకుడు సంగీత అనే యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. వీళ్లిద్దరూ దగ్గరి బంధువులు. ఇరు కుటుంబాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయి. యువతిపై శీను వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో విసిగిపోయిన ఆమె.. యువకుడిపై కేసు పెట్టింది. దీంతో శీనును పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకు వెళ్లి వచ్చాక కూడా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. అదేపనిగా యువతిని వేధించడం ప్రారంభించాడు.

ఇలాగే మద్యం మత్తులో వేధించడం ప్రారంభించారు. భరించలేకపోయిన యువతి.. శీను చేతులు కట్టేసి మరి కొత్తితో పొడిచి హత్య చేసింది. హత్య అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Exit mobile version
Skip to toolbar