Telangana: రాష్ట్రంలో 43 కోట్లతో 12 మెడికల్ స్టోర్స్

ఇకపై తెలంగాణాలో ప్రభుత్వ మెడికల్ స్టోర్స్ రానున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు మందులను సత్వరంగా అందచేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ వ్యాప్తంగా 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

Health Department: ఇకపై తెలంగాణాలో ప్రభుత్వ మెడికల్ స్టోర్స్ రానున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు మందులను సత్వరంగా అందచేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ వ్యాప్తంగా 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూ. 43.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల తాకిడి అధికమౌతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. మరోవైపు ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయడమే ప్రధాన ఉద్ధేశంగా అధికారులు పేర్కొంటున్నారు.

స్టోర్ లో పనిచేసేందుకు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ సిబ్బంది విధానంలో భర్తీ చేయనున్నారు. సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, వికారాబాద్, గద్వాల ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాటు పూర్తి అయితే ప్రజలకు త్వరితగతిన వైద్యసేవలు మరింతగా అందనున్నాయి. పరిసర ప్రాంతాల్లోని వైద్యశాలలకు కూడా ఈ స్టోర్స్ ద్వారా మందులను సరఫరా చేసే సౌకర్యం కూడ కలుగనుంది.