AP CM Jagan: ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్‌గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది.
మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిల్..(AP CM Jagan)
పిల్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులు జగన్, సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య కోరారు. జగన్ ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిల్‌పై జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్‌లో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పిల్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీనిని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకిరించింది. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. కేసులో హైకోర్టు ప్రతివాదులు జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు జారీ చేసింది.