Site icon Prime9

తెలంగాణ: దుబాయ్‌లో రూ.30 కోట్లు జాక్‌పాట్ కొట్టిన తెలంగాణ వలస కూలీ

dubai

dubai

Emirates Lucky Draw: దుబాయ్ లో పనిచేస్తున్న తెలంగాణ యువకుడికి అదృష్టం తలపు తట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. దుబాయ్‌లో కొన్న లాటరీటికెట్‌తో అతను రూ.30 కోట్లు గెలుచుకున్నాడు. దీని తో యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుగూరుకు చెందిన అజయ్ ఓగుల ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల కింద దుబాయ్ వెళ్లాడు. అక్కడ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు ఉన్న అతడు ఇటీవల 15 దిర్హమ్‌లు( 338 రూపాయలు) పెట్టి రెండు లాటరీలు కొన్నాడు. అందులో ఓ లాటరీ టికెట్‎కి 30 కోట్లు వచ్చింది. భారీ మొత్తం గెలుచుకున్నాడని తెలియగానే అజయ్ పొంగిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా ఆనందంలో మునిగిపోయారు.

ఇప్పటికీ తాను లాటరీ గెలిచినట్లు నమ్మలేకపోతున్నానని అజయ్ తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బుతో కొంత కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలిపాడు. నిరుపేద కుటుంబానికి చెందన తమకు సొంత ఇల్లు కూడా లేదన్నాడు. ముందుగా తన తల్లికి, సోదరికి ఇల్లు కట్టిస్తానని వెల్లడించాడు. కుటుంబ సభ్యులకు దుబాయ్ చూపిస్తానని పేర్కొన్నాడు. మిగతా డబ్బుతో ఊరు వచ్చి వ్యాపారం చేయనున్నట్లు అజయ్ పేర్కొన్నాడు.

Exit mobile version