Site icon Prime9

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల

Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రభుత్వం   శ్వేతపత్రం విడుదల చేసింది. దాంతో స్వల్ప కాలిక చర్చకు స్పీకర్ అనుమతించారు. ఆర్ఘిక మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క మొదటగా మాట్లాడి దాని గురించి వివరించారు. పదకొండు అంశాల మీద తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది.

శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు..(Telangana Assembly Sessions)

తెలంగాణ బడ్జెట్‌- వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉంది. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది. 2014- 15 లో అప్పు రూ.72,658 కోట్లు కాగా ప్రస్తుతం రూ.6, 71, 757 కోట్లకు అప్పు చేరింది.పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదు.రెవెన్యూ రాబడిలో రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం 34 శాతానికి పెరిగింది.ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు రెవెన్యూ రాబడిలో మరో 35% ఖర్చు అవుతోంది.పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది.2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో పది రోజులకు బ్యాలెన్స్ తగ్గింది.విద్య వైద్య రంగాలకు సరిపడా నిధులు ఖర్చు చేయలేదు.రోజువారి ఖర్చులకు కూడా ఆర్బిఐపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.2014లో మిగులు రాష్ట్రం.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది.బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం.6 గ్యారంటీలను అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నాము
అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని భట్టి విక్రమార్క తెలిపారు.

అనంతరం మాట్లాడిన హరీష్ రావు తమకు  శ్వేత పత్రాన్ని అధ్యాయనం చేయడానికి సమయం ఇవ్వాలని కోరారు. ఆయనకు మద్దతుగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అసదుద్దీన్, సీపీఐ ఫ్లోర్ లీడర్ కూనమ నేని సాంబ శివరావులు కూడా టైం అడగడంతో.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అరగంట టీబ్రేక్ కావాలని స్పీకర్ ను కోరారు. దాంతో స్పీకర్ అరగంట పాటు సభను వాయిదా వేశారు.

Exit mobile version