Chandrababu Quash Petition:ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 28నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకూ సుప్రీంకోర్టుకి సెలవులున్నాయి. విచారణ వాయిదా పడినా లేదా ఆలస్యం అయినా చంద్రబాబు కేసు అక్టోబర్ 3 తరువాతే తేలే అవకాశాలుంటాయి.
విచారణ తేదీ నిర్ణయిస్తాం..(Chandrababu Quash Petition)
క్వాష్ పిటిషన్‌పై త్వరగా పూర్తి విచారణ చేయాలని ప్రధాన న్యాయమూర్తిని చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా అడిగారు. సోమవారం సిజెఐ బెంచ్ ముందు చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా మెన్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నిరోజులుగా జైల్లో ఉన్నారని సిజెఐ చంద్రచూడ్ ఆరా తీశారు. రేపు మరోసారి మెన్షన్ చేయాలని లూథ్రాకి సిజెఐ సూచించారు. విచారణ తేదీని రేపు నిర్ణయిస్తామని సిజెఐ చెప్పారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో మళ్లీ కస్టడీకి కావాలని సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. కస్టడీ పొడిగింపు పిటీషన్‌పై తమ వాదనలు కూడా వినాలని చంద్రబాబు తరపు న్యాయవాది పోసాని నిన్ననే కోరారు. ఈ రోజు మెమోపై కోర్టు విచారించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో పిటీ వారెంట్‌లపై కూడా విచారించాలని సీఐడీ కోరింది.
రెండు రోజులపాటు చంద్రబాబుని ప్రశ్నించిన సిఐడి అధికారులు నివేదికని సీల్డ్ కవర్‌లో సమర్పించారు. బెయిల్ పిటిషన్‌పై సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిలోని రెండు పేరా గ్రాఫ్‌లపై ఏసీబీ కోర్టు జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించి మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించారు. దీంతో సీఐడి అధికారులు20 నిమిషాల సమయం కోరారు.