Site icon Prime9

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలు పై మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీమ్ కోర్టు

supreme court

supreme court

 Supreme Court: ఏపీలో ఇసుక మైనింగ్‌ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులోనూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. గతంలో విచారణ సందర్భంగా అక్రమ ఇసుక తవ్వకాలు వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా పలు చోట్ల ఇంకా తవ్వకాలు సాగుతున్నాయనే ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈరోజు ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.ఇసుక మైనింగ్‌పై తదుపరి విచారణ జులై 15న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.

సుప్రీం మార్గదర్శకాలివే..(Supreme Court)

ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాల‌న్న సుప్రీంకోర్టు.ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం వ్యవస్థ ఏర్పాటు .టోల్‌ఫ్రీ నంబర్‌, ఈమెయిల్‌ ఏర్పాటుతో విస్తృత ప్రచారం .కేంద్రపర్యావరణశాఖ తరచూ తనిఖీలు చేపట్టాలి.తనిఖీల సమాచారం రాష్ట్ర అధికారులకు ఇవ్వనవసరంలేదు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చర్యలకు వెనుకాడవద్దు .ఎన్జీటీ తీర్పులోని ప్రతి అంశం తప్పక పాటించాలి. కేంద్ర అధికారులు గుర్తించిన మైనింగ్‌ ప్రదేశాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి .మైనింగ్‌ జరిగిన ప్రదేశాలను కలెక్టర్లు తనిఖీ చేయాలి .ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి క్రిమినల్‌ చర్యలు చేపట్టాలి .జులై 9లోపు ఆదేశాల అమలుపై కేంద్రం, రాష్ట్రం అఫిడవిట్‌ ఇవ్వాలి

Exit mobile version