Site icon Prime9

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు పై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి.. అంగళ్లు లో ఉద్రిక్తత

Chandrababu Naidu

Chandrababu Naidu

Chandrababu Naidu: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు రోడ్ షోను సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకుంటామంటూ.. అంగళ్లు కూడలి వద్దకు వైసీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. నల్లజెండాలతో చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు చించివేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగి పరస్పరం రాళ్ళ దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురు టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఘటనా స్థలికి పోలీసులు భారీగా చేరుకున్నారు.

డీఎస్పీ యూనిఫామ్ తీసేయాలి..(Chandrababu Naidu)

ఇలాఉండగా వైసీపీ కార్యకర్తల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తాను బాంబులకే భయపడలేదు.. రాళ్లకు ఎందుకు భయపడతానని ప్రశ్నించారు. పోలీసులు చోద్యం చూసారని డీఎస్పీ తన యూనిఫామ్ తీసేయాలన్నారు నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టాను.. దైర్యం ఉంటే రండి చూసుకుందాం అని అన్నారు. ఇక్కడనుంచి పుంగనూరు వెడుతున్నాను.అక్కడ రావణాసురుడు లాంటి ఎమ్మెల్యే ఉన్నాడు. అతను ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.ఇతని అరాచకాలు హద్దు మీరాయి. రాక్షసుడు కంటే హీనంగా ఉన్నాడు. నన్ను రాకుండా నల్ల జెండాలు చూపుతారా…?కర్రలతో వస్త్తే కర్రలతో వస్తాను.రౌడీలకు రౌడీగా ఉంటాను అంటూ చంద్రబాబు హెచ్చరించారు.

బహిరంగ సభలో చంద్రబాబు పై రాళ్ళ దాడి | Chandrababu Road Show | YCP Vs TDP | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar