Gandhi Bhavan:సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్‌లో పుట్టినరోజు ఘనంగా జరిగాయి. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేక్ కట్ చేసి సోనియాగాంధీకి విషెస్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత మొదటిసారి రేవంత్ రెడ్డి గాంధీభవన్ రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. సోనియా గాంధీకి 78 వ పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి 78 కిలోల కేక్ కట్ చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, కష్టం..(Gandhi Bhavan)
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామని ఈ రోజు వారి ఆశీస్సులతోనే అసెంబ్లీకి వెడుతున్నామన్నారు. 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టిందన్నారు. ఈ దిశగా రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారన్నారు. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియానకి సోనియాగాంధీ వచ్చినపుడు ప్రజలు ఆమెకు ఇచ్చిన గౌరవం చూసి ఎంతో సంతోషించారని అన్నారు. మరలా అటువంటి రోజును చూడలేమని అన్నారు.అన్నివర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని అన్నారు.