Supreme Court on Postal ballots: పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ వాదనలను సుప్రీమ్ కోర్ట్ తోసిపుచ్చింది .దీనితో సుప్రీంకోర్టులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది . పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైసీపీ వేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మీద సోమవారం ఉదయం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వైసీపీ తరఫున లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదనలను వినిపించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన వెలగపూడి రామకృష్ణ ఈ కేసు విషయంలో కేవియట్ దాఖలు చేశారు. ఆయన తరఫున ఆదినారాయణ, సిద్ధార్థ లూధ్రా, రవితేజ పదిరి, జవ్వాజి శరత్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ వైసీపీ దాఖలు చేసిన ఎస్ ఎల్ పిని డిస్మిస్ చేసింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడంలో ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులపై వైసీపీ అభ్యన్తరాలు వ్యక్తం చేసింది .బ్యాలెట్ పత్రాల కవర్ పై సీల్ లేకపోయినా ,అధికారి సంతకం లేకపోయినా బ్యాలెట్ ఓట్లను తిరస్కరించవద్దని సీఈఓ తెలియ చేయడం జరిగింది .దీనిపై వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది .