Supreme Court: ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ ఆస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తెలంగాణ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్‌డీ లను విడుదల చేయాలని ఈడీని ఆదేశిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఈడీ అధికారులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
వడ్డీనైనా విడుదల చేయాలి..(Supreme Court)
జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈడీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుని పున: పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఎఫ్‌డీలకు బదులుగా బ్యాంకు గ్యారంటీలను తీసుకున్న తర్వాత కూడా ఎఫ్‌డీలను జప్తు చేసుకుందని భారతి సిమెంట్స్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు.ఎఫ్‌డీలపై వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలని భారతీ సిమెంట్స్ మరో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్లపై విచారణ ముగిసిందని, అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.