Site icon Prime9

sharmila: రెండో రోజు కొనసాగుతున్న షర్మిల ఆమరణ నిరహార దీక్ష

sharmila

sharmila

Sharmila: వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని లోటస్‌పాండ్‌లోని నివాసం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష నేపథ్యంలో.. లోటస్ పాండ్‌ను పోలీసుల దిగ్బంధించారు. అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలను ఎవరినీ లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు.

మరోవైపు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ నేతల, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసేంత వరకు దీక్ష ఆపేది లేదంటున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు శుక్రవారం ఆమె ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పాదయాత్ర చేసుకోనివ్వకుండా న్యాయస్థానం తీర్పునే సీఎం కేసీఆర్‌ అగౌరవ పరస్తున్నారన్నారని షర్మిల మండిపడ్డారు.

వైఎస్ షర్మిలకు వైద్య పరీక్షలు చేశారు అపోలో డాక్టర్.చంద్ర శేఖర్. వైఎస్ షర్మిల మంచి నీళ్ళు కూడా తాగట్లేదని..ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని డాక్టర్ చెప్పారు. మంచి నీళ్ళు తీసుకోక పోవడంతో డీహైడ్రేషన్ అవుతోందని..కిడ్నీలకు ప్రమాదమని అన్నారు. రక్త పరీక్షలు నిర్వహించామని పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమాదమన్నారు. సాయంత్రం మరో సారి వైద్య పరీక్షలు చేస్తామని వెల్లడించారు.

Exit mobile version