Site icon Prime9

Secunderabad Alpha Hotel: సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై టాస్క్ ఫోర్స్ దాడులు.. లక్ష రూపాయలు జరిమానా

Alpha Hotel

Alpha Hotel

Secunderabad Alpha Hotel:ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోజు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారు. సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, సందర్శిని హోటల్స్ లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

అపరిశుభ్ర ఆహారం.. పరిసరాలు..(Secunderabad Alpha Hotel)

హోటల్లో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. రెండు రోజుల క్రితం ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్ తో బిర్యానీ తయారు చేసినట్లు గుర్తించారు. ఆహారాన్ని తయారుచేసి ఫ్రిజ్లో పెడుతున్నట్లు పసిగట్టారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్థాలను వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నారు. ఆల్ఫా హోటల్, సందర్షిని,రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లలో నాసిరకం వస్తువులతో పాటు దుర్గంధంగా ఉన్న వంట శాలను చూసి అధికారులు విస్తుపోయారు.హోటల్లో ఎలుకలు తిరుగుతూ ఉండడం, దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని అధికారులు వెల్లడించారు. ఆల్ఫా హోటల్ లో తయారు చేసే బ్రెడ్ తో పాటు ఐస్ క్రీమ్ లకు డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయలు ఫైన్ విధించారు.

Exit mobile version