Site icon Prime9

YS Sharmila :వైఎస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు ?

YS Sharmila

YS Sharmila

YS Sharmila: వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నిన్న జోగిపేట పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాలు ఫిర్యాదు చేశారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ని అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసిందని నిన్న ఫిర్యాదు చేశారు.

షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్థానిక దళిత సంఘం అధ్యక్షుడు సటికె రాజు, ఇతర ఎస్సీ నాయకులు.. జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 30న జోగిపేట పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో షర్మిల క్రాంతి కిరణ్‌పై భూకబ్జాదారుడని దూషించారని రాజు ఆరోపించారు. అలాగే క్రాంతి కిరణ్‌పై అవమానకరమైన పదజాలం ఉపయోగించారని చెప్పారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌‌పై షర్మిల అవమానకరంగా మాట్లాడారని.. అయితే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తారని తాను చాలా కాలంగా ఎదురుచూశానని తెలిపారు. దళిత సంఘం నాయకుడిగా దళిత ఎమ్మెల్యేకు జరిగిన అవమానంపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అయితే వైఎస్ షర్మిలపై ఫిర్యాదు అందిందని జోగిపేట పోలీసులు తెలిపారు. అయితే ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version