Road Accidents in A.P.: ఇటీవల క్రమం తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి .రోడ్లు రక్తపు ఏరులై పారుతున్నాయి .తాజాగా జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపాలెంలో కల్వర్ట్‌ను కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు సంఘటన స్థలంలోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సమయంలో మూడు మృతదేహాలు కారులో ఇరుక్కున్నాయి. వాటిని తీసేందుకు అధికారులు, స్థానికులు తీవ్రంగా శ్రమిచారు. దారి కనిపించకపోవడం అతివేగమే ఈప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
కృష్ణాజిల్లాలోకూడా..(Road Accidents in A.P.)
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్‌పి పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడే చని పోయారు . మరో వ్యక్తి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ సిఐ అల్లు లక్ష్మీ నరసింహమూర్తి, వీరవల్లి ఎస్ ఐ చిరంజీవి తన పోలీసులు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కొవ్వూరు నుంచి తమిళనాడు కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా చెబుతున్నారు. మృతుల వివరాలు స్వామినాథన్ (40), రాకేష్ (12 ) రాధప్రియ(14), గోపి(23) అక్కడిక్కడే మృతి చెందగా సత్య (28) (స్వామినాథన్ భార్య ) తీవ్రంగా గాయపడ్డారు.కాకినాడలో కూడా ఓ కాారును బస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దురు సంఘటన స్థలం లోనే చనిపోయారు. వీళ్లంతా విజయనగరం వాసులుగా గుర్తించారు .