Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.రేవంత్ రెడ్డితో పాటు మిగతా 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది.
రేవంత్ టీం ఇది..(Revanth Reddy)
మంత్రులుగా మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సాయంత్రం మంత్రి పదవులు కేటాయిస్తారు. కొత్త కేబినేట్లోకి రేవంత్ రెడ్డి.. 11 మందిని మంత్రులుగా తీసుకున్నారు.ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకలు హాజరయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ సీఎంలు, మాజీ సీఎంలు, సీనియరఖ్ నేతలు హాజరయ్యారు. అంతకుముందు రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలోవేదిక వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవడంతో ఎల్బీ స్టేడియం కక్కిరిసింది.
ఆరు గ్యారంటీల ఫైల్ పై తొలి సంతకం..
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమైన ఆరు గ్యారంటీల దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసారు.అనంతరం దివ్యాంగురాలు రజిని నియామక ఉత్తర్వులపై సంతకం చేసారు. గతంలో రజిని నాంపల్లి గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డిని కలిసి తాను పీజీ చేసినా ఎవరూ తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు రజినిని తన ప్రమాణస్వీకార కార్యక్రమానిక ఆహ్వానించి ఆమెకు నియామక పత్రాన్ని అందజేసారు.