Revanth Reddy in Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన రేవంత్ రెడ్డి.

: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్‌లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 12:44 PM IST

Revanth Reddy in Delhi: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్‌లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.

అగ్రనేతలకు ఆహ్వానం (Revanth Reddy in Delhi)

బుధవారం పార్టీ పెద్దలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర ప్రముఖులను రేవంత్ రెడ్డి కలిసి వారిని తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలుకనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ చార్జిలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణికం ఠాగూర్‌తోపాటు మరికొందరు ముఖ్య నేతలను రేవంత్ ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్‌ను రేపు ఎల్బీ స్టేడియానికి రావాల్సిందిగా రేవంత్ కోరారు. తెలంగాణ అమరుల కుటుంబాలతో పాటు, కోదండరామ్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచ ఐలయ్య, మరికొందరు ఉద్యమ కారులను ఆహ్వానించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలని ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని రేవంత్ కోరారు. మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపనున్నారు . తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్‌తోపాటు మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులని ఆహ్వానించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలు, మేధావులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.ఢిల్లీలో పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. కాసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు..

సమావేశాల అనంతరం మంత్రి మండలి పేర్లను అధిష్టానం ఫైనల్ చేయనుంది.ఇప్పటికే బట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. సమీకరణలను బట్టి ఎవరెవరికి కేబినెట్ లో బెర్త్ దక్కుతుందోననే ఉత్కంఠ కొనసాగుతుంది.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం ముస్తాబవుతోంది. ప్రమాణ స్వీకారం సభ సందర్భంగా ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్, చీఫ్ వెటర్నరీ డాక్టర్ అబ్దుల్ వకీల్ తదితరుల బృందం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించింది.