Site icon Prime9

వారాహికి బదులుగా వరాహం అని పెట్టుకో.. మంత్రి అంబటి రాంబాబు

Ambati

Ambati

Ambati Rambabu : తన మీద పవన్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవనే కాపుల గుండెల్లో కుంపటి అంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కాపుల శని అంటూకాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును పోలవరం గురించి ఏరోజైనా ప్రశ్నించావా అని ప్రశ్నించారు.

పవన్ తన వాహనానికి వారాహికి బదులుగా వరాహం అని పెట్టుకుంటే కొంతైనా మంచి జరుగుతుందని అన్నారురానున్న రోజుల్లో చంద్రబాబును గాడిదలాగా మోస్తానని పవన్ అంటున్నారంటూ రాంబాబు ఎద్దేవా చేశారు. గ్లాసుకు వేసే ఓట్లు మురిగిపోతాయని రాంబాబు పేర్కొన్నారు.పవన్ కల్యాణ్‌కు చాలా మందితో విడిపోవడం అలవాటనని కాపులను గాడిదలు చేయవద్దన్నారు.చంద్రబాబు వెంటే నడుస్తానని పవన్ మరోసారి చెప్పారు. చంద్రబాబును సీఎం చేసేందుకే వచ్చానని పవన్ డైరక్టుగా చెప్పొచ్చుగా. కలిసి పోటీ చేసి ఉంటే బాగుండేది అంటూ ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు? అంటూ రాంబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తానని చెప్పారని. అప్పటి ఇరిగేషన్ మంత్రిని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదని పవన్‌ను అంబటి నిలదీశారు. పోలవరం పూర్తి చేయకపోతే తాను మంత్రిని కాదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పవన్ అంటూ మండిపడ్డారు.

Exit mobile version