Nara Lokesh: చంద్రబాబు జోలికి రావడం.. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పని దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేసారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు అధికారం అంటే ఏమిటో తెలియదన్నారు. జగన్‌కు అధికారం అంటే కక్షసాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస మాత్రమే అని అన్నారు.
జగన్‌కు ఒళ్లంతా విషమే..(Nara Lokesh)
పాముకు తలలోనే విషం ఉంటుంది..జగన్‌కు ఒళ్లంతా విషమే.చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదు. చంద్రబాబు అరెస్టును..బెంగాల్ సీఎం, జోహో సంస్థ ఛైర్మన్ ఖండించారు.పింక్ డైమండ్, వివేకా హత్య, కోడికత్తి కేసుల్లో ఎంత అబద్ధం ఉందో.. ఈ కేసులోనూ అంతే అబద్ధం ఉంది. చంద్రబాబుకు, ఆయనకు చెందిన వారి ఖాతాల్లోకి డబ్బు వెళ్లిందని నిరూపించలేకపోయారని లోకేశ్ అన్నారు. జగన్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా.. అసలు నీ చరిత్ర ఏంటి? జగన్.. నీపై ఎన్ని కేసులున్నాయి..వాటి వివరాలు మాలాగా పబ్లిక్‌గా చెప్పగలవా? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. జగన్‌పై 7 ఈడీ కేసులు ఉన్నాయి..21 ఇతర కేసులున్నాయి.జగన్‌పై 38 కేసులు ఉన్నాయి.. 10 సీబీఐ కేసులున్నాయి. జగన్‌పై కేసులు పదేళ్లుగా ట్రయల్‌కు కూడా రావడం లేదు. జగన్ ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో దీన్నిబట్టే అర్థం అవుతోందని లోకేశ్ అన్నారు.బాబాయి హత్యకేసు ముద్దాయిలను సైకో జగన్ కాపాడుతున్నారు.సీబీఐకి పోలీసులను అడ్డుపెట్టి అవినాష్ అరెస్ట్ కాకుండా జగన్ కాపాడారు.నేను రాజమండ్రిలోనే ఉన్నా.. ఎక్కడికీ పారిపోలేదు.నన్ను అరెస్టు చేయాలనుకుంటే వచ్చి చేసుకోండి అంటూ లోకేశ్ సవాల్ చేసారు.
చంద్రబాబు అంటే ఓ బ్రాండ్..
చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని బిల్‌గేట్స్, క్లింటన్, ఫార్చ్యూన్ 500 సీఈవోలు కూడా చెబుతారు.అలాంటి వ్యక్తిపై దొంగకేసు పెట్టి జైలుకు పంపింది సైకో జగన్ ప్రభుత్వం అంటూ లోకేశ్ మండిపడ్డారు. ప్రజలు, రాష్ట్రం, దేశం తప్ప వేరేమీ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు. ఎప్పుడూ ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి గురించే ఆలోచిస్తారు.ప్రజాసంక్షేమం తప్ప అవినీతి చేయడం అనేది మా రక్తంలోనే లేదు. దేశ రాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు.దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు.చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో ఎప్పుడూ లేనంత స్పందన వచ్చిందన్నారు. టీడీపీ బంద్‌కు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలిపారు. బంద్‌లో పాల్గొన్న జనసేన, సీపీఎం, ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.