Posani krishnamurali: మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు పై సినీ నటుడు ,వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరో సారి విరుచుకు పడ్డారు .చంద్రబాబు పబ్లిక్‌గా ఏపీ సీఎం జగన్‌ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌ను చంపేందుకు కుట్రలు..(Posani krishnamurali)
ఎన్నో రోజులుగా సీఎం జగన్‌ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు . జగన్ ను ఉద్దేశించి ‘రేపే నిన్ను చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా? అంటూ మండి పడ్డారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్ళింది వేల కోట్లు తినడానికే అని పోసాని ఆరోపించారు . అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్‌ను దెబ్బ తీసుకోకండ అని పోసాని అన్నారు.