Chandrababu Naidu Comments: జగన్ మూర్ఖత్వం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు.
టీడీపీ హయాంలో 72 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎంత శాతం పనులు చేసిందో చెప్పాలని డిమాండ్ చేసారు.
పోలవరం డ్యామ్‌పై 1.8 కి.మీ నడిచి పనులు చంద్రబాబు పరిశీలించారు. కుంగిన పోలవరం గైడ్‌బండ్‌ను చంద్రబాబు సందర్శించారు.పోలవరంలో దెబ్బతిన్న కాఫర్ డ్యామ్‌లను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. అసమర్థ పరిపాలన వల్ల పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. జగన్ వచ్చాక కమీషన్ల కోసం గుత్తేదారులను మార్చారని ఆరోపంచారు. ప్రాజెక్టు నిర్మాణంలో మా హయాంలో అవినీతి లేదని కేంద్రం చెప్పింది. పోలవరం.. సున్నితమైన ప్రాజెక్టు..ప్రమాదకరమైన ప్రాజెక్టు.పోలవరం ప్రాజెక్టును మనం కాపాడుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.