CM Siddaramaiah: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రభుత్వాన్ని సాగనంపడానికి తెలంగాణ ప్రజలు నవంబర్ 30 కోసం ఎదురుచూస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.
రేవంతర్ రెడ్డి రెండు చోట్లా విజయం సాధిస్తారు..(CM Siddaramaiah)
రెండు స్దానాల్లో పోటీ చేస్తున్న రేవంతర్ రెడ్డి రెండు చోట్లా విజయం సాధిస్తారని అదే సమయంలో కేసీఆర్ ను ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని సిద్దారామయ్య అన్నారు. కర్ణాటకకు కాంగ్రెస్ ఐదు హామీలు ప్రకటించింది.. మోదీ, కేసీఆర్ వీటిని అమలు చేయడం అసాధ్యమని అన్నారు.కానీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడ్డాక వారం రోజుల్లో అమలు చేశాం.. ఈరోజు పథకాలు అమలు చేసి కర్నాటక ఆర్థికంగా బలపడింది.దీనితో మోదీ భయంతో వణుకుతున్నారు. హామీల అమలు కష్టమని కేసీఆర్ చెబుతుంటే.. వచ్చి కర్ణాటకలో పర్యటించమని అడుగుతున్నాం. మేముఎలా ఉన్నామో చూపిస్తాం. కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా పథకాలు అమలు చేస్తామని సిద్దరామయ్య స్పష్టం చేసారు. మోదీ లాంటి అబద్దాలు చెప్పే ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. తెలంగాణకు వచ్చి బీసీ మహాసభ నిర్వహించి, వెనుకబడిన తరగతుల రక్షకుడిగా తనను తాను అభివర్ణించుకున్నారు. కానీ ఆయన వారి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. హాస్యాస్పదంగా మోదీ కారణంగానే వారు ఇంకా వెనుకబడి ఉన్నారని ఆయన అన్నారు.
బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్..
జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లన పెంపు
ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం
ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులం ఏర్పాటు
ఐదేళ్లలో బీసీ అభివృద్ధికి లక్ష కోట్ల ఖర్చు
బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఏర్పాటు చేస్తాం
BC-Dలో ఉన్న ముదిరాజ్ కులస్థులను BC-Aలో చేరుస్తాం
బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణం
జనగామ జిల్లాను సర్వాయిపాపన్న జిల్లాగా మారుస్తాం
రాష్ట్రంలో మూడు చోట్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం
నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్