Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్థణల అనంతరం సచివాలయంలోని బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.

  • Written By:
  • Publish Date - June 19, 2024 / 12:57 PM IST

Pawan Kalyan:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్థణల అనంతరం సచివాలయంలోని బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఫైల్ పై తొలి సంతకం చేశారు డిప్యూటీ సీఎం. వివిధ శాఖలకు చెందిన అధికారులు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.

వదినమ్మ ఇచ్చిన పెన్నుతో..(Pawan Kalyan)

ఇటీవల పవన్ కళ్యాణ్ కు వదిన సురేఖ పెన్నును గిఫ్ట్ గా ఇచ్చారు. బాధ్యతలు తీసుకునే సమయంలో పెన్ను మర్చిపోయినట్టు పవన్ కళ్యాణ్ గుర్తించారు. వ్యక్తిగత సిబ్బంది చేత సూట్ కేసు తెప్పించుకొని అందులో ఉన్న పెన్ను తీసుకున్న పవన్ కళ్యాణ్ దానితో మంత్రిగా తన సంతకం చేసారు. దీనితో పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

పవన్ కు అభినందనలు..

అంతకు ముందు పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంప్ కార్యాలయం నుంచి సచివాలయానికి బయలు దేరారు. క్యాంప్ కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి కాన్వాయ్ గా బయలుదేరి సెక్రటేరియట్ చేరుకున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.