Site icon Prime9

Pawan Kalyan Satires: గుడివాడలో రోడ్లంతా గోతుల మయం..స్థానిక ఎమ్మెల్యే నోరు బూతులమయం.. పవన్ కళ్యాణ్

Pawan Kalyan(gdv)

Pawan Kalyan(gdv)

Pawan Kalyan Satires: గుడివాడలో రోడ్లంతా గోతుల మయం.. స్థానిక ఎమ్మెల్యే నోరు బూతుల మయమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గుడివాడలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి భూములను లాక్కోవడానికి కొత్త పథకం వేసిందని విమర్శించారు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ధ్వజమెత్తారు.

దేశం మీద అభిమానంతో రాజకీయాల్లోకి..(Pawan Kalyan Satires)

ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తే.. ఎంతటి వారికైనా ఎదురు తిరుగుతానని పవన్ అన్నారు. సొంత రక్తమైనా సరే.. తాను ప్రజల తరపున ప్రశ్నిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం వరి దిగుబడి తగ్గిపోయిందని.. క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని.. బీజేపీ అధిష్టానంతో మాట్లాడి ప్రజల కోసం నిలబడ్డామన్నారు. కూటమి అదికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 7వేల పై చిలుకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారని అన్నారు. కౌలు రైతుల మరణాలపై ఎవరూ మాట్లాడరని ఆరోపించారు. బీజేపీ నాయకత్వంతో మాట్లాడి కూటమికి ఒప్పించానని పవన్ పేర్కొన్నారు. తాను దేశం మీద, నేల మీద అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలకు ఓర్చుకున్నానని తెలిపారు. చంద్రబాబును జైల్లో పెట్టారు. అటువంటి పరిస్దితి ఎవరికైనా రావచ్చని అందుకే జైలుకు వెళ్లి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించానని పవన్ కళ్యాణ్ అన్నారు.

Exit mobile version