Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ యాజమాన్యం జనసేనానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. డిసెంబర్ 14న ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కి ఓ లేఖని రాశారు. జనవరిలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ ఈవెంట్ కి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా ఆహ్వానించారు. ఇంకొకరైతే ఎగిరి గంతేసి అంగీకారం తెలిపేవారేమో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు.
గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు..( Pawan Kalyan)
ఈ మేరకు వేల్స్ యూనివర్సిటీకి పవన్ ఓ లేఖ రాశారు. వివిధ రంగాలలో రాణించిన గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారని వారికి డాక్టరేట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. తనని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్‌కి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని అలాగే గౌరవంగా కూడా భావిస్తానని పవన్ అన్నారు. కానీ తనకంటే చాలా మంది గొప్పవారు ఉన్నారు. వారిలో సరైనవారికి ఈ డాక్టరేట్ ఇవ్వాలని పవన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా యూనివర్సిటీ 14వ కాన్వకేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోతున్నానని పవన్ లేఖలో పేర్కొన్నారు.