Pawan kalyan in Pithapuram: గొప్పవిజయానికి పిఠాపురం నుంచే బీజం పడిందని.. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరాన్ని సందర్శించిన పవన్.. అనంతరం వారాహి సభలో పాల్గొన్నారు.
అసెంబ్లీ గేటును బద్దలు కొట్టుకుని వెళ్లాం..(Pawan kalyan in Pithapuram)
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండారని వైసీపీ నేతలు అన్నారని.. పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నాను.. ఇక్కడే ఉంటానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఘన విజయం సాధించామని గుర్తుచేశారు. వంద శాతం స్ట్రయిక్ విజయం మామూలు విషయం కాదని పవన్ అన్నారు. వైసీపీ నేతలు పవన్ అసెంబ్లీ గేటు కూడా తాకడు అన్నారని.. కానీ ఇప్పుడు అసెంబ్లీ గేటు తాకడం కాదు.. గేటు బద్దలు కొట్టుకొని వెళ్ళాం అని పవన్ చెప్పారు.హోం, రెవెన్యూ, ఆర్థిక శాఖలు తీసుకోమని తనను అడిగారని అయితే కష్టమైనా, క్లిష్టమైనా ప్రజల కోసమే పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని పవన్ చెప్పారు. ఎమ్మెల్యేగా మరోసారి పిఠాపురం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ప్రజల కన్నీరు తుడవలేని అధికారం ఎందుకు? తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
పాడైన రోడ్లను బాగుచేస్తాం..
30 వేల మహిళలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. యువతి అదృశ్యం కేసును 9 నెలలైనా ఛేదించలేకపోయారు. 9 రోజుల్లోనే ఆ అమ్మాయి ఆచూకీ కనుగొన్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై ప్రజలకు విపరీతమైన ఆగ్రహం ఉందన్నారు.మీ కోపం, ఆవేదన, బాధను మెజార్టీల రూపంలో చూపించారు. ప్రజాస్వామ్యం అసలైన శక్తి ఏమిటో ప్రజలు చూపించారు.కూటమికి వచ్చిన మెజార్టీలు చూసి సీనియర్ నేతలే ఆశ్చర్యపోయారని అన్నారు. త్వరలోనే పాడైన రోడ్లను బాగుచేస్తామని తెలిపారు. పరిపాలనలో చంద్రబాబుకు అనుభవం, సమర్థత ఉందన్నారు. చంద్రబాబుకు ఉన్న అనుభవంతోనే పింఛన్లు ఒకేరోజ ఇచ్చేశామన్నారు. మీరు ఇచ్చిన బలం వల్ల కేంద్రం వద్ద మా పరపతి పెరిగింది. ఏపీ నుంచి వచ్చారంటే చాలు.. ఢిల్లీ పెద్దలు స్పందిస్తున్నారు.కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేశాం.. కాస్త సమయం ఇవ్వండంటూ పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు.