Site icon Prime9

Pavan kalyan : విశాఖ గడ్డపై జనసేనాని

janasenani

janasenani

Pavan kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పవన్ కల్యాణ్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో పవన్ కల్యాణ్ జనసేన కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఎయిర్‌పోర్టు వద్ద థింసా నృత్యం, తప్పెటగుళ్ళు, కోలాటం లాంటి సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలు నిర్వహించడంతో అక్కడ కోలాహలం నెలకొంది.

ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, తాటిచెట్ల పాలెం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, ఎన్టీఆర్ విగ్రహం (బీచ్ రోడ్) మీదుగా నోవాటెల్ వరకు జనసేన ర్యాలీ జరుగుతోంది..   పవన్ కళ్యాణ్ పార్టీ  నాయకులు, శ్రేణులతో సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. విశాఖపట్నం అర్బన్, రూరల్ పరిధిలోని జనసేన నాయకులతో పార్టీ ప్రణాళికలు, వాటి అమలు అంశాలపై సమావేశమవనున్నారు పవన్. రేపు విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జిల్లాల ‘జనవాణి’ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. 17వ తేదీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు జనసేనాని. అనంతరం బీచ్ రోడ్డులోని వై.ఎమ్.సి.ఎ. హాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో పవన్ సమావేశమవనున్నారు.

మూడు రోజుల పాటు విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు పవన్ పూనుకున్నారు. జనవాని కార్యక్రమం పేరుతో ఆయన ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఏర్పాట్లు చేసిన జనవాణికి భారీగా స్పందన వచ్చింది.. విశాఖలో పవన్ కార్యక్రమానికి భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఏర్పాట్లను మెగా బ్రదర్ నాగబాబు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. తమ్ముడి పర్యటన ఏర్పాట్లలో భాగంగా విశాఖ లో ఉత్తరాంధ్ర జనసేన నేతలతో సమీక్షలు నిర్వహించారు

Exit mobile version