Site icon Prime9

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌

Megastar chiranjeevi

Megastar chiranjeevi

Megastar Chiranjeevi:తెలుగువారి ఆరాధ్య నటుడు, సౌత్ ఇండియా సూపర్ స్టార్… దశాబ్దాలుగా సామాజికసేవలో తరిస్తున్న రియల్ హీరో.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది . పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది.ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు… అంటే జనవరి 25న పద్మ అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఈ అవార్డుల ప్రకటన తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని ముందునుంచి ప్రచారం జరిగింది. ఈ ఏడాది ప్రకటించే పద్మ పురస్కారాలలో చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మవిభూషణ్ వరించబోతోందని ప్రైమ్9 గతంలోనే చెప్పింది.

మూడు సార్లు ఉత్తమనటుడిగా..(Megastar Chiranjeevi)

సుమారు 155 సినిమాలకు పైగా హీరోగా చేసిన చిరంజీవి ఎంతోమందికి ఆదర్శప్రాయం కూడా. ఒకపక్క తెలుగు సినీ పరిశ్రమకు , మరొక పక్క తెలుగువారికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా… 2006లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇక ఇప్పుడు చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించడంతో మెగా అభిమానులతో పాటు , తెలుగువారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం ఖరీదు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన చిరంజీవి తాజాగా భోళా శంకర్ ఎన్నో రకాల విభిన్న పాత్రలు పోషించి అభిమానుల గుండెలలో మెగాస్టార్ గా నిలిచిపోయారుప. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మూడు సార్లు ఉత్తమనటుడిగా నంది అవార్దును , 8 ఫిల్మ్ ఫేర్ అవార్డులను పొందారు. 2007 లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ , అదే ఏడాది ఆంధ్రా యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు.

దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు ..

కోవిడ్ స‌మ‌యంలో సినీ కార్మికులతో పాటు, సామాన్యుల‌ను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవ‌ల‌ను గుర్తించి మోదీ ప్ర‌భుత్వం మెగాస్టార్‌ను ప‌ద్మ‌విభూష‌ణ్‌తో గౌరవించింది. లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అంద‌జేశారు చిరంజీవి. సినీ కార్మికుల‌తో పాటు కొవిడ్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డిన సామ‌న్య ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అంబులెన్స్‌, ఆక్సిజ‌న్ స‌దుపాయాల‌ను ఉచితంగా క‌ల్పించారు. కాంగ్రెస్ హ‌యాంలో ప‌ద్మ‌భూష‌ణ్ అందుకున్న చిరంజీవిని ఇప్పుడు బీజేపీ సర్కార్ ప‌ద్మ‌విభూష‌ణ్‌తో సత్కరించింది .

Exit mobile version