Pawan Kalyan: సొంత చిన్నాయనను చంపిన వారిని కాస్తున్నావు.. మరలా పాపం పసివాడిలా మాట్లాడుతున్నావు అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేసారు.
సీఎం జగన్ సొంత చిన్నాన్న హత్యకు గురయితే గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. సీబీఐతో సహా అన్నిదారులు ముఖ్యమంత్రి ఇంటివైపే చూపుతున్నాయి. నువ్వు అందరినీ చంపి చేతికి రక్తం అంటుకుని పసిపిల్లవాడిలా మాట్లాడుతావా? చిన్నాయన కూతురు సునీత గారు డాక్టర్ . ఆవిడకు నిన్న కోర్టులో లాయర్ లేకపోతే ఆవిడ కేసు తనే వాదించుకున్నారని పవన్ అన్నారు.
పరిశ్రమలు రానివ్వవు..(Pawan Kalyan)
పరిశ్రమలు రానివ్వవు.. రివర్స్ టెండరింగ్ అంటావు. 20 శాతం నుంచి 70 శాతం వరకు టాక్సులు వేస్తావు. మొన్న మంగళగిరిలో చేసిన శంకు స్దాపనకు 53 లక్షలు కట్టాను. అంతకుమందు 20 లక్షలు ఉండేది. మేము కష్టపడి పన్నులు కడితే నువ్వు అనుకున్నకొంతమందికి పంచుతావు. సినిమాలు ఆడనివ్వవు. అనుబంధ పరిశ్రమలు రానివ్వవు. అభివృద్ది లేకుండా అప్పలు చేస్తుంటే అది అభివృద్ది ఎలా అవుతుంది? ఒక ఫ్లోర్ వేసుకోవాలంటే, రోడ్డు మీద కంకర వేసుకోవాలంటే fవైసీపీ నేతలకు లంచాలు ఇవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
సీఎంది పైశాచిక ఆనందం..
నాకు తెలిసి రెండే కులాలు. ఎంత పవర్ ఫుల్, ఎంత పవర్ లెస్ .. దేశమంతటికీ తెలిసినా ప్రపంచంలో పేరున్నా ఈ సీఎం ముందు చేతులు కట్టుకుని నిలుచోవాలి. చాలామంది అభిమానించే వ్యక్తులను ఆయన ఎదుట చేతులు కట్టుకుని నిలుచునేలా చేసాడు. పైశాచిక ఆనందం అనుభవించాడు. నువ్వు ముఖ్యమంత్రివి అయితే నీ పని నువ్వు చేసుకో అని పవన్ కళ్యాణ్ అన్నారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు బటన్ నొక్కుతున్నాడు. నేను నా కష్టం, నా స్వేదం, నా రక్తం తో సంపాదించిన డబ్బును 1,000 మంది కౌలు రైతులకు ఇచ్చానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు.