Site icon Prime9

Chandrababu Naidu: జగన్ వల్ల ప్రజలే కాదు.. నేనూ మానసికక్షోభ అనుభవించాను.. చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu

Chandrababu Naidu

Chandrababu Naidu:  వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూసీఎం వైఎస్ జగన్ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయిందని మండిపడ్డారు. . రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి ఆర్థికంగా మానసిక క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. శారీరక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వంలో ప్రజలు మాత్రమే కాకుండా తానూ మానసిక క్షోభ అనుభవించినట్లు వెల్లడించారు. అందరూ భాద పడుతుంటే జగన్ మాత్రం ఆనందపడుతున్నారని ఆక్షేపించారు. 40 రకాల పన్నులను ప్రజలపై ప్రభుత్వం మోపిందని విమర్శించారు. సీఎం గా పని చేసిన తనకు ఇన్ని రకాలుగా పన్నులు విధించవచ్చన్న విషయం తెలియలేదని ఎద్దేవా చేశారు. నెల్లూరు కోర్టులో ఫైల్ దొంగతనం చేసిన కాకాని ని వదిలిపెట్టనని హెచ్చరించారు.. వైసీపీలో కూడా అంతర్యుద్దం మొదలైందని అన్నారు. రాష్ట్రంపై గౌరవం ఉండేవారు ఆ పార్టీలో ఉండరని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలను నిర్విర్యం చేశారని.. జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఒక్కో ఓటుకు పది వేల రూపాయలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీని ఇంటికి పంపించడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోని రావడం తథ్యమని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు ఘటనలో తనపై కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందర్ రెడ్డిని చంపిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు లేవని విమర్శించారు మనకెందుకని పోరాటం చేయకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలూ ముందుకు రావాలని పిలుపిచ్చారు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఒకవైపు ఉంటే.. జగన్ ఒక్కడే ఒక వైపు ఉన్నారని.. ఇప్పటికే యుద్ధం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు.

Exit mobile version