Site icon Prime9

Nikhat Zareen: జాతీయ బాక్సింగ్​ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిఖత్‌ జరీన్‌

Nikhat Zareen

Nikhat Zareen

Nikhat Zareen: తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరుగుతున్నబాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తన ప్రత్యర్థి అనామికపై 4-1 తేడాతో నిఖత్‌ జరీన్‌ విజయం సాధించి విజేతగా నిలిచింది. దీనితో ఈఏడాది ఆడిన అన్ని టోర్నమెంట్లలోనూ నిఖత్ గెలిచినట్లయింది.

అంతకుముందు ఆదివారం 50 కేజీల విభాగం సెమీస్‌లో ఆలిండియా పోలీస్‌ (ఏజీపీ) జట్టు బాక్సర్‌ శివిందర్‌ కౌర్‌పై నిఖత్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. అదే జోరుతో నేడు జరిగిన ఫైనల్లో రైల్వేస్‌ బాక్సర్‌ అనామికపై ఘన విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పతకం సొంతం చేసుకున్న నిఖత్ ఇప్పుడు జాతీయ చాంపియన్ షిప్ కూడా గెలిచింది.

Exit mobile version