Site icon Prime9

Nara lokesh -pawan kalyan: పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేసిన నారా లోకేష్..

Nara lokesh -pawan kalyan

Nara lokesh -pawan kalyan

Nara lokesh -pawan kalyan: రాజమండ్రి జైలు సాక్షిగా…జనసేన, టీడీపీ ఒక్కటై పొత్తు పెట్టుకున్నాయి. చివరకు ఆ పొత్తు ధర్మమే..ఏపీలో ధర్మాన్ని గెలిపించి అధర్మాన్ని పాతరేసింది. సీన్ కట్ చేస్తే ఏపీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నపుడు పవన్ కళ్యాణ్ కలిసి ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు వెడతానని తెలిపారు.

అన్నదమ్ముల అనుబంధం..(Nara lokesh -pawan kalyan)

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయాన్ని సాధించింది. బుధవారం మంత్రుల ప్రమాణస్వీకారం సందర్బంగా ఆసక్తికర సంఘటన జరిగింది. తమకు నైతికంగా అండగా నిలిచినందుకు కృతజ్జతగా నారా లోకేష్…జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకున్నారు. మొదటి నుంచి పవన్ ని అన్నయ్యగా భావిస్తున్నానని చెప్పిన లోకేష్..పవన్ కు పాదాభివందనం చేశారు. ఈ వీడియో దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అన్నదమ్ముల అనుబంధం అంటూ అభిమానులు వీరిద్దరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కిన లోకేష్ | Pawan Kalyan Blessing For Nara Lokesh | Prime9 News

Exit mobile version
Skip to toolbar